NTV Telugu Site icon

Crime News: లవర్‌ కోసం స్నేహితుడి హత్య.. ఏపీలో వెలుగుచూసిన మరో దారుణం..

Crime News

Crime News

Crime News: లవర్‌ కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ప్రేయసి కోసం.. తన స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేశాడు హరిహర కృష్ణ అనే యువకుడు.. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటనే ఒక ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.. ప్రియురాలి వివాదంతో యువకుని హత్య కేసును చేధించారు పోలీసులు.. జనవరిలో కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.. మురళీకృష్ణను హత్య చేసింది స్నేహితులు దినేష్ కుమార్, కిరణ్ కుమార్‌గా గుర్తించారు..

Read Also: Supreme Court : అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దినేష్ కుమార్ ప్రియురాలు నగ్న వీడియోలను ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని మురళీకృష్ణ బ్లాక్ మెయిల్ చేసినట్టుగా గుర్తించారు.. అయితే, మురళీకృష్ణ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యాత్నం చేసింది. ఇక, ప్రియురాలిని వేధించాడని కక్ష పెంచుకున్న దినేష్.. జనవరి 25వ తేదీన మురళీకృష్ణను పంచలింగాల దగ్గరకు తీసుకుకెళ్లాడు.. తన ప్లాన్‌ ప్రకారం.. కత్తితో గుండెలపై పొడిచాడు.. దీంతో, మురళీ కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు.. ఈ హత్య కోసం దినేష్ కుమార్ తన స్నేహితుడు కిరణ్ కుమార్ సాయం తీసుకున్నాడు.. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు.. అయితే, తన కుమారుడు కనిపించడం లేదని ఆందోళనకు గురైన మురళీకృష్ణ కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. లవర్‌ కోసం దినేష్‌ కుమార్‌ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు.. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు.. మురళీకృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువ లో 10 కిలోమీటర్ల మేర గాలించినా.. ఇంకా మురళీకృష్ణ మృతదేహం దొరకలేదు.. ఎదినకొడుకు ఇలా దారుణ హత్యకు గురికావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు మృతుడు మురళీకృష్ణ కుటుంబ సభ్యులు.