NTV Telugu Site icon

Pawan Kalyan: పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్‌ ప్రాజెక్టు పవర్ హౌస్ పరిశీలన..

Pawan

Pawan

కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్‌ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్‌ పవర్‌, సౌర విద్యుత్‌, హైడల్‌ పవర్‌ యూనిట్స్ ఉన్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ప్రాజెక్టు విజిట్ చేశామని చెప్పారు. సోలార్, హైడల్, జల విద్యుత్.. పొల్యూషన్ లేని విద్యుత్ ఇక్కడ తయారవుతుందని అన్నారు. అనిల్ చలంశెట్టి, మహేష్ గ్రీన్ కో ప్రారంభించారని తెలిపారు. దేశంలో లక్షన్నర కోట్లు పెటుబడి పెట్టారు.. ఏపీలో రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు.. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. పిన్నపురంలో రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇంకా 14 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.

Mahesh Babu : మార్ష‌ల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?

అటవీ నిబంధనలు ఉల్లగించారంటే చూడ్డానికి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. 2800 ఎకరాల్లో 1700 ఎకరాలు కొన్నారు.. రాళ్లు రప్పలు ఉండి వ్యవసాయానికి పనికి రాని భూముల్లో ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. చంద్రబాబు ఐటీ తరువాత గ్రీన్ ఎనర్జీ పై దృష్టి పెట్టారు.. అందులో భాగంగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దేశానికి ప్రతిష్టాత్మకమైనది రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు. దేశానికి రెండున్నర లక్షల పెట్టుబడులు తీసుకురాగలిగారు.. 365 ఎకరాలు కేంద్రం నుంచి అటవీ భూమి కొన్నారు, అందుకు కంపెనీ 365 ఎకరాల భూమి నెల్లూరు జిల్లాలో ఇచ్చారని వెల్లడించారు. 40 ఎకరాల భూమి ఫారెస్టు, రెవెన్యూ మధ్య వివాదం ఉంది.. దీన్ని పరిశీలించడానికి వచ్చానని చెప్పారు.

Congress : ఈనెల 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ.

ఆఫీసులో కూర్చొని సమీక్షించడానికి, ఫీల్డ్‌కి వెళ్లి సమీక్షించడానికి తేడా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది భారీ ప్రాజెక్టు.. ఇందులో చిన్న చిన్న వయోలేషన్స్ ఉంటే కరెక్షన్ చేయాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. పర్యాటక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ టూర్ ప్లేస్‌గా అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద యువతకు ఉపాధి కల్పించే పనులు, రైతులకు ప్రయోజనాలు కల్పించే పనులు యాజమాన్యం చేయాలని తెలిపారు. 43 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు ఇవ్వగలిగెంత విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. కడప, చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణకు గురవుతున్నాయని.. అటవీశాఖ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, అటవీ భూముల వివాదాలపై సమీక్ష చేస్తానని చెప్పారు. కర్నూలు అద్భుతమైన నగరం కావాలని తెలిపారు. అలాగే.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Show comments