NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

Pawan

Pawan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (మార్చ్ 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్.. ఇక, కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి పూడిచెర్ల చేరుకోనున్నారు పవన్‌.. పూడిచెర్లలో ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Read Also: KKR vs RCB: నేడు కోల్‌కతా-బెంగళూరు మధ్య తొలి మ్యాచ్.. వర్షం ముప్పు..!

అయితే, ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రైతు సూర రాజన్న పొలంలో ఫారం పాండ్‌కు భూమి పూజ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.. ఇక, పవన్‌ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని గురువారం రోజు కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్‌. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు సభకు 4వేల మంది వరకు హాజరు కానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, పూడిచర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్.