Site icon NTV Telugu

CM Chandrababu: రేపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమీక్షలు, సమావేశాలు, ర్యాలీలు.. మధ్యలో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు రేపు (17వ తేదీ) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.25కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఇక, సీఎం కర్నూలు సీ క్యాంపు రైతు బజార్‌ను పరిశీలించి స్థానికులతో ముఖాముఖి మాట్లాడతారు. కేంద్రీయ విద్యాలయ వద్ద స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర పార్క్‌కి శంకుస్థాపన చేస్తారు. కేంద్రీయ విద్యాలయ వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు. మరోవైపు, టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికి అభినందనలు తెలపడంతో పాటు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు..

Read Also: Celebi: మాకు టర్కీతో సంబంధాలు లేవు.. భారత్ నిర్ణయంపై కోర్టుకెక్కిన సెలెబి..

Exit mobile version