Posani Krishna Murali: వరుస కేసులతో పోసాని కృష్ణమురళి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఓ వైపు కేసులు.. మరోవైపు అరెస్ట్‌లు.. పోలీసులు ప్రశ్నల వర్షం.. కోర్టులో హాజరుపర్చడం.. రిమాండ్ విధించడం వరకు ఓ ఎత్తు అయితే.. ఆ తర్వాత పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.. తాజాగా, పోసాని కేసులో కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు ఆదోని పోలీసులు.. మరోవైపు, పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.. ఈ రెండు పిటిషన్లపై రేపు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ జరగనుంది.. ఇక, పోసాని మురళి కృష్ణకు 14 రోజులు రిమాండ్ విధించింది కర్నూలు కోర్టు.. గుంటూరు నుంచి కర్నూలుకు పీటీ వారెంట్‌పై తెచ్చి పోసానిని అరెస్ట్ చేశారు పోలీసులు.. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ను దూషించారన్న కేసులో పోసాని నిందితుడిగా ఉన్నారు..
Read Also: NZ vs SA Semifinal: రచిన్ రవీంద్ర, విలియమ్సన్ సెంచరీలు.. భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్
మరోవైపు, పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కడప కోర్టు.. పోసాని బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ రేపటికి వాయిదా పడింది.. ఇలా ఎక్కడ చూసినా.. పోసానిపై కేసులు.. అరెస్ట్ చేయడం.. కోర్టులో హాజరుపర్చడం.. పోలీసులు విచారణ.. కస్టడీకి ఇవ్వాలంటూ.. పిటిషన్లు వేయడం.. ఇంకోవైపు.. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలంటూ పోసాని కోర్టును ఆశ్రయించడం.. అంతా హాట్ టాపిక్‌గా సాగుతోంది.