NTV Telugu Site icon

Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..

Knl

Knl

Kurnool: కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు. వాసంతి అనే బాలిక 7వ తేదీ నుంచి కనిపించడం లేదు.. అన్ని ప్రాంతాల్లో వెతికినా దొరకని బాలిక ఆచూకీ.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో గాలిస్తున్నారు. అయితే, ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానితులు అంగీకరించారు. ఇంట్లో చెప్తుందని బాలికను హత్య చేసినట్లు వారు తెలిపారని పోలీసులు వెల్లడించారు.

Read Also: Kidney Scandal : కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్

అయితే, ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ముచ్చుమర్రి బాలిక వాసంతి మృతదేహం గాలింపును ఎమ్మెల్యే జయసూర్య పర్యవేక్షిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండ చూడాలి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కూడా ఈ విషయం మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. నింధితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే జయసూర్య డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. ఇక, బాలికను హత్య చేసి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ లభించలేదు.. దీంతో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. బస్సులపై పోస్టర్ లు అతికించి సెర్చింగ్ చేస్తున్నారు. నిందితుడి స్నేహితుల, బంధువుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ కు వస్తున్న ఫేక్ కాల్స్.. కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Show comments