Site icon NTV Telugu

వ‌చ్చేవారం కేఆర్ఎంబీ స‌మావేశం.. రెండు రాష్ట్రాల‌కు నోటీసులు

KRMB

KRMB

కృష్ణా న‌ది జ‌లాల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.. ఈ నేప‌థ్యంలో ఈ నెల 27న జ‌ర‌గ‌నున్న‌ కృష్ణానదీ యాజమాన్య బోర్డు స‌మావేశానికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.. ఇప్ప‌టికే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా స‌మావేశం నిర్వ‌హించ‌గా.. ఈ నెల 27వ తేదీన స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఇక‌, నోటీసుల‌తో భేటీ అజెండాను జతపరిచిన కేఆర్ఎంబీ.. కృష్ణాజలాల్లో రాష్ట్రాల వాటా, అజెండాలో బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, విద్యుత్‌ అంశాలు, చిన్ననీటిపారుదల వనరులు, గోదావరి జలాల మళ్లింపు తదితర అంశాలపై చ‌ర్చ ఉంటుంద‌ని పేర్కొంది.

Exit mobile version