Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తో్న్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లీగల్ నోటీసు పంపించారు.. తనపై అసత్య ఆరోపణలు ఆధారాలు లేకుండా చేస్తూ పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు వల్లభనేని వంశీ మోహన్‌.. గన్నవరం విమానాశ్రయ టెర్మినల్ పనుల కాంట్రాక్ట్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు లీగల్ నోటీసులు పంపించారు. తనపై ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారని వంశీ ఆరోపించారు. ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ లేదా సివిల్ డ్యామేజీ దావా వేస్తామని నోటీసుల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును హెచ్చరించారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌..