NTV Telugu Site icon

Krishna District: చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఐదుగురు క్షేమం.. ఇద్దరు మృతి

Swimming

Swimming

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు రేపు గన్నవరం జీజీహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.

Read Also: Team India: న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..

ఈ ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా ఉండటంతో శాంతించారు. మరోవైపు.. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Pawan Kalyan: ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ శుభవార్త..

Show comments