Site icon NTV Telugu

MLA Bode Prasad: లబ్ధిదారులకు ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లు..

Bode Prasad

Bode Prasad

MLA Bode Prasad: ఆరు నెలల్లో టిడ్కో ఇళ్లు పూర్తి లబ్ధిదారులకు అందజేస్తాం అన్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ఈరోజు ఉయ్యూరు నగర పంచాయతీ సర్వసభ్య సమావేశానికి తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు బోడె ప్రసాద్.. ఉయ్యూరు నగర ఎక్స్ అఫీషియల్ నెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు శాసనసభ్యులు బోడె ప్రసాద్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన నగర పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కౌన్సిలర్లు, చైర్మన్ వల్లభనేని నాని మరియు సిబ్బంది కలిసి బోడే ప్రసాదును సత్కరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బోడె ప్రసాద్.. ఉయ్యూరు నగర పంచాయతీలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో అసంపూర్ణంగా ఉన్న టిడ్కో గృహాలను ఆరు నెలల్లోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. వివిధ కారణాలవల్ల అనర్హులైన లబ్ధిదారులకు గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిన డిపాజిట్ సొమ్మును బోడే ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. మొదటి విడతగా నూట నలభై ఐదు మందికి దాదాపు 30 లక్షల రూపాయలను తిరిగి చెల్లింది ప్రభుత్వం.

Read Also: Sivaji: ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసిన శివాజీ

Exit mobile version