Site icon NTV Telugu

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..

Jogi

Jogi

Jogi Ramesh: Jogi Ramesh: కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మూలపాడులోని VTPS లో ఫ్లయాష్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పెద్ద ఎత్తున నిల్వ ఉంచారనీ, ఆ ఫ్లయాష్‌ను స్థానిక లారీ యజమానులకు పంపిణీ చేస్తామని పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?

ఈ సందర్భంగా వైసీపీ నేత జోగి రమేష్ ను భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇక, బారికెడ్లు పెట్టి ఎటు వెళ్లకుండా వైసీపీ నేతలను పోలీసులు నిలువరించారు. కార్యకర్తలు, నాయకులు నెట్టుకొని వెళ్లే ప్రయత్నం చేసిన పోలీసులు మాత్రం ఎటు కదలనియలేదు. అలాగే, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెడ్ బుక్ రాజ్యాంగం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Exit mobile version