NTV Telugu Site icon

Tiruvuru: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు..

Kolikapudi

Kolikapudi

Tiruvuru: తిరువూరు టీడీపీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తీరుతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేకు చెక్ పెట్టే విధంగా అధిష్ఠానం నిర్ణయం ఉంటుందంటున్న పార్టీ వర్గాలు.. గడిచిన 100 రోజుల్లోనే పార్టీకి తలనొప్పిగా ఎమ్మెల్యే వ్యవహార శైలి మారింది. కొలికపూడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ప్రథమశ్రేణి నాయకులు.. ఇప్పటికే పరోక్షంగా తెరమీదకొచ్చిన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి శావల దేవదత్.. గత మూడ్రోజుల నుంచి దేవదత్ కార్యాలయానికి పార్టీ శ్రేణులు క్యూ కట్టారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అండతో భవిష్యత్ లో క్యాడర్ కు అండగా ఉంటానని దేవదత్ చెప్పుకొచ్చారు.

Read Also: Jaishankar: ‘నేను వెళ్తున్నాను కానీ…’ పాకిస్థాన్‌కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

ఇక, నేడు మధ్యాహ్నం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరుగునున్న తిరువూరు సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. తిరువూరు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శావల దేవదత్ మాట్లాడుతూ.. గడిచిన మూడేళ్లుగా ప్రజల్లోనే ఉన్న, పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను అని చెప్పుకొచ్చారు. ఎన్నికల అనంతరం నా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యాను.. పార్టీ విజయం సాధించేందుకు నా వంతుగా కష్టపడ్డాను.. కానీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు ప్రజలందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మూడు రోజులుగా నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాను.. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాను.. తిరువూరి నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో నిత్యం ఉంటాను అని శావల దేవదత్ తెలిపారు.

Show comments