విజయవాడలో జనసేన జనవాణి అనే కార్యక్రమం నిర్వహించింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. బెజవాడలో పెద్ద ఎత్తున గోవధ జరుగుతోందని, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకునే వెలంపల్లి ఏం చేస్తున్నారు..? అని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గోవధ గురించి మాట్లాడితే ఓట్లు పడవని వైసీపీ భయం.ఓట్లు కోసం జనసేన రాజకీయం చేయదు.. ఓట్లు పడకపోతే ఏమవుతుంది..? మార్పు అయితే వస్తుందిగా.గంజాయి, మద్యం సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
బస్ స్టాండ్ల పక్కనే మద్యం దుకాణాలు ఉంటున్నాయి.మద్య నియంత్రణ చేస్తామన్న జగన్ మద్యాన్ని ప్రొత్సహిస్తున్నారు.రేపల్లె ఘటనలో హోం మంత్రి తానేటి వనిత క్రిమినల్సుని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.క్రిమినల్సును వెనకేసుకొచ్చే ప్రభుత్వమిది.కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ విఙప్తులు వచ్చాయి.కాపు సామాజిక వర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నారు.దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారు.ఎస్సీ మేధావులు కూడా వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆలోచన చేయాలి.విజయవాడ పరిసరాల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు పవన్.
బయటకు పచ్చగా కన్పించినా.. భూగర్భ జలాలు బాగా కలుషితం అయ్యాయి.ఈ ప్రాంతంలో ఇంతటి కాలుష్యం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది.సమస్యలు లేనట్టైతే జనవాణి ఫెయిల్ అవ్వాలి.. కానీ ఈ కార్యక్రమానికి విపరీతంగా సమస్యలు వచ్చాయి.ప్రభుత్వం నిర్వహించే స్పందన ద్వారా 98 శాతం పరిష్కారం లభించడం లేదు.ప్రజలను కౌగిలించుకుని.. ముద్దులు పెడితే సమస్యలు పరిష్కారం కావు.ముద్దులు కాదు.. పని అవుతుందా లేదా అని అంబేద్కర్ సీఎం జగన్ను అడిగి ఉండేవారు.151 మంది ఎమ్మెల్యేలకు ఈ సమస్యలను పరిష్కరించే సమయం ఎందుకు లేదు..?
ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడానికి ఉండే సమయం సమస్యల పరిష్కారానికి ఎందుకుండదు..?నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు.నేను సీఎంను కాను.. ముద్దుల మామయ్యను కాను.సమస్యలను పరిష్కారించేలా మా వంతు ప్రయత్నం చేస్తా.ఎక్కువ మంది దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తాను.ఏపీకి సమర్థుడైన నాయకుడు లేడు.వచ్చే ఎన్నికల్లో గెలవాలి..? ప్రత్యర్థి పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలనే విషయంలో అధికార పార్టీకి సమర్ధత ఉంది.గెలిపిస్తే బాధ్యతతో కూడిన పరిపాలన అందిస్తాం.తప్పు చేసిన వాడి తోలు తీసేసేలా శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తాం.ఏపీకి వైసీపీ హనికరం. వైసీపీ రాక్షస పాలన నుంచి ఏపీని బయటపడేయాలి.జనవాణి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు పవన్.
Tomato Prices: మొన్నటివరకూ భారీ ధర…ఇప్పుడేమో నేలచూపులు