Site icon NTV Telugu

Minister Nara Lokesh: 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు ఉంటాయి.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం..

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌.. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే అందులో మూడు తప్పు ఉంటాయన్న ఆయన.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం అన్నారు.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలని సూచించారు.. ఇక, గతంలో మండలిలో నాపై దాడి చేశారు.. ఇక్కడ దాడి చేస్తే తగ్గుతానని అనుకున్నారు.. మంత్రులు నాపై దాడికి ప్రయత్నం చేస్తే ఎమ్మెల్సీ రాజు అడ్డుకున్నారు అని గుర్తుచేసుకున్నారు.. కార్యకర్తలపై దాడులు, అరెస్టులు గత ప్రభుత్వ హయంలో జరిగాయి.. ఏ అధికారులు భయపెట్టారో వాళ్లే ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నారు అంటే.. అది ప్రజాస్వామ్యం గొప్పతనం అన్నారు.

Read Also: Varalaxmi Sarathkumar : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్

చంద్రబాబును జైలుకు పంపినా ఆయన గుండె ధైర్యంతో ఉన్నారు.. జైల్లో ఉన్న చంద్రబాబును చూస్తే కంటతడి పెట్టాను అని గుర్తుచేసుకున్నారు నారా లోకేష్‌.. అయితే, జైలు నుంచి చంద్రబాబు పులి మాదిరి బయటకు వచ్చారని తెలిపారు. ఇక, అధికారంలో ఉన్నపుడు కూడా ప్రతిపక్షం మాదిరిగానే ఆలోచన చేయాలి.. అప్పుడే.. ప్రజల సమస్యలు తెలుస్తాయి.. వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు.. మరోవైపు, ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు ఉంటాయి.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలన్నారు.. వైఎస్‌ జగన్ తో కంటే 3 రెట్లు పార్టీలో నేను కొట్లాడతాను.. కడపలో మహానాడు విషయంపై కూడా నేను పొలిట్ బ్యూరో లో మాట్లాడాను.. ప్రతి జిల్లాలో మహానాడు పెట్టాలని కోరాను.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా చివరికి చంద్రబాబు నిర్ణయం అమలు చేస్తాను అని స్పష్టం చేశారు.. తప్పు జరిగితే సరిదిద్దు కోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version