NTV Telugu Site icon

Perni Jayasudha: పేర్ని జయసుధకు కోర్టులో ఊరట..

Perni Jayasudha

Perni Jayasudha

Perni Jayasudha: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది.. అయితే, ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. గత వారం విచారణ ముగించిన జిల్లా కోర్టు.. విచారణను వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.. ఈ కేసులో విచారణకు సహకరించాలని జయసుధకు ఆదేశాలు జారీ చేసింది..

Read Also: World’s Best Actors: ప్రపంచ ఉత్తమ నటుల జాబితా విడుదల.. భారత్‌ నుంచి ఒకే ఒక్కరు..

కాగా, ఏ2 మేనేజర్ మానస తేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మరోవైపు.. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు.. మొదట 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించగా.. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. మొత్తంగా గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని చెబుతున్నారు అధికారులు.. అయితే, ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మాజీ మంత్రి పేర్నినాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విదితమే.. కొన్నిసార్లు పేర్నినాని కనిపించినా.. ఆయన ఫ్యామిలీ మొత్తం అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న విషయం విదితమే..

Show comments