NTV Telugu Site icon

Perni Nani: పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి.. గుడివాడలో ఉద్రిక్తత..!

Perni Nani

Perni Nani

Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కాచి మరి పేర్ని నాని కాన్వాయ్‌ను అడ్డుకుని కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. తమ అధినేతపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Read Also: Mobile phone explode: ఛార్జింగ్ సమయంలో చేతిలో పేలిన మొబైల్ ఫోన్.. బాలుడికి తీవ్రగాయాలు..

అయితే, మాజీ మంత్రి పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి జరిగిన విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు భారీగా చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దూషణలకు దిగడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, మాజీమంత్రి పేర్ని నానిపై జరిగిన కోడిగుడ్ల దాడిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సమాజంలో ఇలాంటి దాడులు మంచిది కాదన్నారు.

Show comments