NTV Telugu Site icon

CMR SHOPPING MALL: గుడివాడలో సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభం..

Cmr

Cmr

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌ను గుడివాడలో ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ డౌక్ సెంటర్‌లో బుధవారం (నవంబరు 27)న ఉదయం 09:30 గంటలకు గుడివాడ శాసనసభ్యులు వెదిగండ్ల రాము ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, జాతీయ విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎ.పి.వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పిన్నమనేని బార్జి, మాజీ చైర్మన్, గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యంవర్తి శ్రీనివాసరావు, గుడివాడ ఎన్.టి.ఆర్, స్టేడియం కమిటీ. బూరగడ్డ శ్రీరాం, గుడివాడ జనసేన పార్టీ సభ్యులు కామేపల్లి తులసి, గన్నవరం ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Honda Amaze: బుకింగ్స్ ప్రారంభం.. డిసెంబర్ 4న అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

సి.ఎం.ఆర్. ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ.. తమ 38వ షోరూమును గుడివాడలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి. ఎం.ఆర్. లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్‌లో.. కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం.ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందని చెప్పారు.

Read Also: Eknath Shinde: సీఎంపై బీజేపీ నిర్ణయమే ఫైనల్.. బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తా..

సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. సి.ఎం.ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయని తెలిపారు. తమ 38వ షోరూమును గుడివాడలో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో, డిజైన్లు, వెరైటీలు లభిస్తాయన్నారు. ప్రస్తుత యువతరానికి నచ్చే విధంగా అన్నిరకాల వెరైటీలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీతారలు నైనా సారిక, సంయుక్త మీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించారు. పట్టు ఫ్యాన్సీ చీరలు తమకెంతో నచ్చాయన్నారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగి తమ డ్యాన్సులతో ఫ్యాన్సును ఉర్రూతలూగించారు.