Bird Flu In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలంలోని అనుమ్మోలంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. గడిచిన రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 10 వేలకు పగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర చనిపోయిన కోళ్ళను గంపలగూడెం వెటర్నరీ వైద్యుడు జి. సాయి కృష్ణ పరిశీలించారు. వైరస్ తో చనిపోయిన ప్రాంతాల్లోని సుమారు 10 కిలో మీటర్ల పరిధిలో చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను తినొద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మృతి చెందిన కోళ్లను టెస్టుల కొరకు ల్యాబ్ కు పంపనున్నారు అధికారులు. 18 లక్షల ఖర్చుతో 15 వేల కోడి పిల్లలను పౌల్ట్రీలో పెంచుతున్నామని పౌల్ట్రీ ఫారం నిర్వాహకుడు అత్తునూరి కాంత రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 10 వేల కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోతున్నాయి.. లక్షల్లో నష్టం వాటిల్లింది.. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.
Read Also: Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‌లో భారీ మోసం.. రూ. 562 కోట్ల విలువైన నకిలీ బిల్లులు
మరోవైపు, ఉభయ గోదావరి జిల్లాలను బర్డ్ ప్లూ వణికిస్తుంది. తుర్పు గోదావరి జిల్లా మిర్తిపాడులో బర్డ్ ప్లూతో 8 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో 2 కిలో మీటర్ల పరిధి వరకు బఫర్ జోన్ గా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. వైరస్ సోకిన పౌల్ట్రీ ఫారాలు కిలో మీటర్ పరిధిలో ఆంక్షలు విధించారు. బర్డ్ ప్లూ సోకిన కోళ్లు నిర్మూలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమైయ్యాయి. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.