Site icon NTV Telugu

Vallabaneni Vamshi: వల్లభనేని వంశీ ఫోన్ కోసం గాలిస్తున్న పోలీసులు..

Vallabaneni

Vallabaneni

Vallabaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో ఆధారాల సేకరణ నిమిత్తం హైదరాబాద్ కి రెండు పోలీస్ బృందాలు వెళ్లాయి. ఇప్పటికీ వంశీ మొబైల్ ఫోన్ దొరకలేదు.. దీంతో స్థానిక రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఆ మొబైల్ లో కీలక ఆధారాలు ఉన్నట్టు ఏపీ పోలీసులు భావిస్తున్నారు. అలాగే, ఇదే కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలింపు చేపట్టింది.

Read Also: Gold Price : త్వరపడండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇక, విజయవాడలోని సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ లో కలిశారు. అయితే, ఒకవైపు వంశీతో పాటు మరో ఇద్దరిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పోలీసుల పిటిషన్ ను సోమవారం విచారణ చేస్తామని న్యాయస్థానం పేర్కొనింది. అలాగే, వల్లభనేని వంశీ తరపున బెయిల్ పిటిషన్ వేసేందుకు ఆయన తరఫు లాయర్లు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version