Home Minister Anitha: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు. వంశీ అరెస్ట్ కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు.
Read Also: Hyderabad Chicken Sales: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన చికెన్ అమ్మకాలు!
ఇక, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు అని ఏపీ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చు.. అయినా ఈ 8 నెలల్లో వైసీపీ నేతలు ఎన్నిసార్లు కలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, విజయనగరంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ఓ బులెట్ బాగ్ మిస్సవడం దురదృష్టకరం.. దానిపై విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, బడ్జెట్ లో ప్రజల రక్షణే ప్రాధాన్యతగా హోంశాఖకు ప్రత్యేకంగా కేటాయింపులు రానున్నాయి.. కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం.. గత ప్రభుత్వం హోం శాఖకు సంబంధించి 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కనపెట్టింది.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 73 పథకాలను పునరుద్ధరించామని హోంమంత్రి అనిత వెల్లడించారు.
Read Also: CP Rajasekhar Babu: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై సీపీ కీలక వ్యాఖ్యలు.. తప్పించుకోలేరు..!
అలాగే, పోలీస్ వాహనాలకు ఇంధనం 150 లీటర్ల నుంచి 300 లీటర్లకు పెంచాలని హోంమంత్రి అనిత ప్రతిపాదనలు చేశారు. గత ఐదేళ్లలో ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ లు ఇవ్వలేదు..ఈసారి కేటాయించాలని కోరారు. ఖైదీలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త జైలు భవనాలను నిర్మించడానికి బడ్జెట్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న భవన నిర్మాణాలకు నిధులు సమకూరుస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దీంతో పాటు ప్రింటింగ్ స్టేషనరీ, ఎస్డీఆర్ఎఫ్, సైనిక వెల్ఫేర్ కేటాయింపులపై చర్చించారు. పోలీస్ అకాడమీ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించాలని హోంశాఖ ప్రతిపాదనలు పంపింది. అప్పా, గ్రే హౌండ్స్ ల ఏర్పాటుకు ఆర్థిక తోడ్పాటునందించాలని మంత్రి అనిత కోరారు.
Read Also: Thaman : తమిళ సినిమాలో యాక్టర్ గా తమన్.. ప్రోమో రిలీజ్
కాగా, ఏపీఎస్ఎఫ్ దళాలకు నిధులు కేటాయించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఎయిర్ పోర్ట్, హైకోర్టు తదితర ప్రాంతాల్లో రక్షణనిచ్చే బలగాలకు సంబంధించి నిధులు రాబట్టాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచనలు చేశారు. ఆక్టోపస్ భవన నిర్మాణానికి అవసరమైన రూ.27 కోట్లు నిధులు కేటాయించాలని హోంశాఖ కోరింది. విశాఖపట్నంలో కొత్త సీపీ కార్యాలయం ఏర్పాటుకు నిధులివ్వాలన్నారు. విజయవాడ అడ్మిన్ పరిధిలో అస్త్రం యాప్, సీసీటీవీ కెమెరాల మెయిన్టెన్స్, అవార్డ్స్ పెండింగ్ బకాయిలకు నిధులివ్వాలన్నారు.