Site icon NTV Telugu

ఎన్జీటీకి కృష్ణా బోర్డు లేఖ.. గడువు ఇవ్వండి..!

KRMB

KRMB

నేషన్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, చెన్నైకి లేఖ రాసింది కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన నివేదిక సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువును ఇవ్వాల్సిందిగా.. ఎన్జీటీని కోరారు బోర్డ్ మెంబెర్ సెక్రటరీ రాయపురే.. కాగా, గత వారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాలతో ఇప్పటికే రెండు, మూడు సార్లు పర్యటన వాయిదా వేశారు. అయితే, ఎన్జీటీ పెట్టిన గడువు త్వరలోనే ముగియనుండడంతో… పర్యటన చేసి నివేదిక సమర్పించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపిన నేపథ్యంలో.. మరింత గడువు కోరుతూ లేఖ రాసింది కేఆర్‌ఎంబీ. మరోవైపు… గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణానది యాజమాన్య బోర్డులు అత్యవసరంగా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయగా… రేపు కాకుండా మరోరోజు సమావేశం నిర్వహిస్తే మంచిదని కోరుతూ.. రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Exit mobile version