Site icon NTV Telugu

Krishna River : కృష్ణానది వరద పెరుగుతున్న ఉధృతి.. మరో ప్రమాద హెచ్చరికకు సిద్ధంగా అధికారులు

Krishna River

Krishna River

Krishna River : కృష్ణానదిలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ సమానంగా ఉండి భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5,38,867 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు మరికాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక (Second Danger Warning) జారీ చేసే అవకాశం ఉందని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.

Bihar Elections 2025: బీహార్‌లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు

కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, నంద్యాల జిల్లాల్లో రోడ్డు రవాణా అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు వరద ప్రభావిత మండలాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, వచ్చే 24 గంటల్లో కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించి, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ విభాగం విజ్ఞప్తి చేసింది.

PM Modi: ఇద్దరు యువరాజులు, రెండు అవినీతి కుటుంబాలు.. రాహుల్, తేజస్వీలపై ప్రధాని ఫైర్..

Exit mobile version