NTV Telugu Site icon

Andhra Pradesh: ట్రైనీ ఐపీఎస్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న జాయింట్ కలెక్టర్..

Collecter

Collecter

ప్రెసెంట్ జనరేషన్‌లో పెళ్లి అంటే తమ స్థాయిని చూపించుకునే భారీ వేడుకగా మారిపోయింది. ఉద్యోగులైన, వ్యాపారులైనా, చివరకు సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తుల పెళ్లిని అందరి సమక్షంలో.. లక్షలు ఖర్చు చేసి హంగు, ఆర్భాటంగా జరుపుకునేదిగా మారిపోయింది. అయితే, అందరూ పెళ్లిని ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఒక ఐఏఎస్‌ అధికారిణి.. ట్రైనింగ్‌లో ఉన్న మరొక ఐపీఎస్‌ని సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కలెక్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంత సాదాసీదాగా పెళ్లి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి దేవేంద్రకుమార్‌ను మచిలీపట్నం కలెక్టరెట్‌లోని తన ఛాంబర్‌లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Read Also: Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్.. ఈ నెల 20 వరకు ఆంక్షలు..!

అయితే, అపరాజిత సింగ్ 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ తీసుకుంటుంది. ఆమె స్వస్థలం రాజస్థాన్. ఆయన ఉత్తర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి. కాగా, నూతన వధూవరులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన అనంతరం అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్ వేమవరంలోని శ్రీ కొండాలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక, ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి పేరుతో హడావుడి, హంగామా చేసి ఇది తమ స్థాయి అని చెప్పుకునే ప్రయత్నం చేసే చాలా మందికి ఈ పెళ్లి ఆదర్శంగా నిలుస్తుందని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Banking Charges: సర్వీస్ ఛార్జ్ – పెనాల్టీ పేరుతో ఐదేళ్లలో బ్యాంకులు ఎన్ని వేల కోట్లు వసూలు చేశాయో తెలుసా?