NTV Telugu Site icon

TV Rama Rao Resigns YSRCP: వైసీపీకి షాక్..! పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..

Tv Rama Rao

Tv Rama Rao

TV Rama Rao Resigns YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. త్వరలోనే టీవీ రామారావు.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో.. తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను.. తీవ్ర మనస్థాపంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నా.. అనుచరుల సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది..

Read Also: YS Viveka Murder Case: ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు..

కాగా, 2009లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీచేసిన టీవీ రామారావు.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్‌ నిరాకరించింది.. కానీ, పార్టీ అభ్యర్థి కేఎస్ జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనైనా టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా నిరాశతప్పలేదు.. దీంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన 2019లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు. ఇక, ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడంతో.. ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోంది.