NTV Telugu Site icon

Kottu Satyanarayana: పవన్‌కి సబ్జెక్ట్ లేదు.. దమ్ముంటే చర్చకి రమ్మని మంత్రి ఓపెన్ ఛాలెంజ్

Kottu Fire On Pawan

Kottu Fire On Pawan

Kottu Satyanarayana Fires On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని విమర్శించిన ఆయన.. దమ్ముంటే చర్చకు రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్న పవన్ నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఒక రాజకీయ కుట్ర అని ఆరోపించారు. పవన్ పిచ్చి ఆలోచనలు చేసి, కాలేజీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. దత్తతండ్రి చంద్రబాబు ఏది రాసిస్తే.. అది ప్రజల వద్ద వచ్చి చదివే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కాపులతో తిరుగుతూ.. వారినే తిడతారని, అసలు ఆయన ఎందుకు తిడతాడో అర్థం కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర, దేవాలయ సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ద్రోణ చర్య అనే కంపెనీతో ప్రణాళిక రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. రాబోవు 50 సంవత్సరాల వరకు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. వసతి, దర్శనం ఏర్పాట్లకు మాస్టర్ ప్లాన్ వేశామని చెప్పుకొచ్చారు.

Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం

అంతకుముందు.. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు మెచ్చేలా రామరాజ్యం మా­దిరి సంక్షేమ పాలన కొనసాగుతుందని కొట్టు సత్యనారాయణ చెప్పారు. కానీ.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువు పరిస్థితులు ఎదుర్కుందన్నారు. పేద ప్రజలకు మంచి చేయాలన్న జగన్ సంకల్పం గొప్పదని, అందుకే భగవంతుడు ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదని.. సీఎం జగన్ పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక కొత్త­గా రూ. 3,500 ఆదాయం లేని ఆలయాలకు.. కొత్తగా ధూప దీప నైవేద్య పథకంలో ఆర్థిక తోడ్పాటు అందజేసేందుకు అ­ను­మతి ఇచ్చారన్నారు. దేవుడి భూములను ఆక్రమించుకున్న వారి ఆట కట్టించేందుకు.. దేవదాయ శాఖ చట్టానికి కొత్తగా సవరణలు తీసుకొచ్చామన్నారు.

Rajinikanth: రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నా.. రజినీకాంత్ క్లారిటీ