Site icon NTV Telugu

Kottu Satyanarayana: శ్రీశైలంలో చౌల్ట్రీలపై దేవస్థానానిదే అజమాయిషీ

Kottu Satyanarayana

Kottu Satyanarayana

శ్రీశైల దేవస్థాన పరిధిలోని వివిధ కులాల చౌల్ట్రీలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండేలా ఓ విధానం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రూముల కేటాయింపులు మొదలుకుని చౌల్ట్రీల్లో అందించే సేవల వివరాలను దేవస్థానానికి తెలిపేలా చర్యలు తీసుకుంటాం.రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్ఖానమే కల్పిస్తోందన్నారు. ఆ మేరకు చౌల్ట్రీలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండాలని భావిస్తున్నాం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు ఎలాంటి అవమానం జరగలేదన్నారు.

ఓ ఎమ్మెల్యే లోపల దర్శనం చేసుకుంటున్నారని ముత్యాల నాయుడు కాసేపు ఆగారు. అద్భుతమైన దర్శనం జరిగిందని బూడి ముత్యాల నాయుడు నాతో చెప్పారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో అభివృద్ది చేయాలంటే అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలం అభివృద్ధికి అటవీ, రెవెన్యూ శాఖల నుంచి వచ్చే ఇబ్బందుల పరిష్కారంపై మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మానతో సమావేశం అయ్యాం. శ్రీశైలం దేవస్థానం నుంచి ఏడు చదరపు మైళ్ల మేర భూమిని దేవస్థానానికి కేటాయించారు.

Read Also: Rohit Sharma: రో‘హిట్’.. ధోనీ రికార్డ్ బ్రేక్

దాదాపు 4130 ఎకరాల భూమి ఏడు చదరపు మైళ్ల పరిధిలో ఉంటుంది. అలాగే ఇంకొంత భూమిని వివిధ జీవోల ద్వారా భూమిని దేవస్థానానికి కేటాయించారు. అయితే సరిహద్దులు ఫిక్స్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గతంలోని జీవోల ప్రకారం బౌండరీలు ఫిక్స్ చేయడానికి నిర్ణయించాం. అక్టోబర్ నెలాఖరు నాటికి బౌండరీలు ఫిక్స్ చేయనున్నాం అని చెప్పారు. దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఎంత భూమి కావాలో నిర్ధారించుకుంటాం. అలాగే ఎకో టూరిజం, రెలిజియస్ టూరిజం అభివృద్ధి చేస్తాం అన్నారు.

వైల్డ్ లైఫ్ శాంక్చురీకి, రిజర్వ్ ఫారెస్టుకు ఇబ్బంది కలగకుండా శ్రీశైల దేవస్థాన అభివృద్ధి చేపడతాం. శ్రీశైల దేవస్థానాన్ని.. దేవస్థాన పరిధిలోని భూభాగాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనేది మా ఉద్దేశ్యం కాదన్నారు. దేవస్థాన అభివృద్ధికి అటవీ భూమి అవసరమైతే.. రెండింతల మేర దేవస్థాన భూమిని అటవీ శాఖకు బదలాయించే నిబంధన పైన చర్చిస్తున్నాం అని వివరించారు కొట్టు సత్యనారాయణ.

Read Also: Rohit Sharma: రో‘హిట్’.. ధోనీ రికార్డ్ బ్రేక్

Exit mobile version