NTV Telugu Site icon

Kotamreddy Sridhar Reddy: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kotamreddy Phone Tapping

Kotamreddy Phone Tapping

Kotamreddy Sridhar Reddy Says His Phone Was Tapped: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. తన మీద, తన కదలికల మీద నిఘా పెట్టారని బాంబ్ పేల్చారు. తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్న విషయం తనకు ముందే తెలుసని, అందుకే ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నానని అన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తన వద్ద వేరే ఫోన్ ఉందని, చాలా సిమ్ కార్డులు కూడా ఉన్నాయని అన్నారు. చేతనైతే వీటిని కూడా ట్యాప్ చేయండని, అవసరమైతే ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండని సవాల్ విసిరించారు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో.. అప్పటి ఎస్పీ తన ఫోన్‌పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తనకు తెలియడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాడినని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని పెగాసస్ రికార్డు చేయలేదన్నారు. 30 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడెలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.

Ariyana Glory: కుండ పట్టుకుని కుర్రాళ్ల కొంపముంచుతున్న అరియానా..

అంతకుముందు.. నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజకీయ వారసత్వంతో ఎదగలేదని, స్వతహాగా పోరాటాలతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని ఆరోపణలు చేశారు. తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా.. ఆ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వాళ్లే అనుభవిస్తున్నారని.. ఇకపై ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు. తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని.. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. ప్రజా సమస్యల కోసం తాను జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు.

Robbery: దుండగుల హల్‌చల్.. పోలీసులమంటూ 80 లక్షల దోపిడీ