వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి… తాజాగా, ఆ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి (వైఎస్ వివేకానందరెడ్డి)ని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందన్నారు.. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా.. జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ని కూడా సీబిఐ విచారించాలని సూచించారు కొల్లు రవీంద్ర.
Read Also: Telangana: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ నిధులు వాపస్..
ఇక, అమరావతి విషయంలో న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. మరోవైపు, జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా పేర్కొన్న ఆయన.. జగన్ ది ఫెయిల్యూర్ ప్రభుత్వం అని విమర్శించారు.. ప్రజా ధనాన్ని దోచుకునే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపణలు గుప్పించారు.. దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రంలో ముఖ్య మంత్రి నడిపిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు కొల్లు రవీంద్ర.