Site icon NTV Telugu

హెరిటేజ్‌లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉంది: కొడాలి నాని

ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు టీడీపీ తీరు ఉందని విమర్శించారు.

Read Also:జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా

. హెరిటేజ్ లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉందన్నారు. హెరిటేజ్‌లో ఆశీర్వాద్‌ గోధుమ పిండి కేజీ. రూ.59 ఉంటే మార్కెట్‌ రేటు 52 రూపాయలు ఉందన్నారు. అలాగే అన్ని నిత్యావసర సరుకుల ధరలు మార్కెట్ రేట్ కంటే హెరిటేజ్‌లో ఎక్కువగా ఉన్నాయని నిప్పులు చెరిగారు.కొన్ని మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.

Exit mobile version