NTV Telugu Site icon

Kodali Nani: ఆ గుట్టు తేలాలి.. మోడీకి, కేసీఆర్‌కి లేఖ రాస్తా

Kodali Nani On Babu

Kodali Nani On Babu

Kodali Nani To Write A Letter To Modi KCR On NTR Death: ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. పాదయాత్ర చేయడం కన్నా.. ప్రశాంతంగా పడుకోవడమే లోకేష్‌కు ఇష్టమని ఎద్దేవా చేశారు. తన పాదయాత్రలో భాగంగా సీఎం జగన్‌పై లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్‌కు మాట్లాడటం రాదు అని దుయ్యబట్టారు. పాదయాత్ర లోకేష్ ప్రతిరోజూ 10 కిలోమీటర్లు కూడా నడవడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పాదయాత్ర చేయలేక తన కొడుకు పంపాడని, జనం లేక లోకేష్‌ ఖాళీ కుర్చీలకు స్పీచ్‌లు ఇస్తున్నాడని పేర్కొన్నారు. నిబంధనలు పాటించమని చెప్తుంటే.. అనవసరంగా పోలీసులను తిడుతున్నాడని మండిపడ్డారు.

Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్

నారావారి పల్లె నుంచి వలస వెళ్లిపోయింది చంద్రబాబేనని, దత్తపుత్రుడు కూడా హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయాడని కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు దెబ్బకు లోకేష్ బాబాయ్‌ ఏమయ్యాడో తెలియడం లేదని, పండగకు నారావారిపల్లెలో నీ బాబాయ్‌ ఎందుకు కనపడడు? అని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారని.. ఆరోజు చంద్రబాబు, కడప జిల్లా నేతలు పోలీసులతో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు ఫోన్ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేశారు. అప్పటి డీజీపీ, టీడీపీ నేతల ఫోన్‌ కాల్స్‌పై విచారణ చేయాల్సిందేనని కోరారు. కడపలో జిల్లాలో గంటా శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి, వివేకా ఓటమికి కారణమయ్యారని.. ఎన్నికల ముందు వివేకాను చంపి, కేసును సీఎం జగన్‌పై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ఒంటరిగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచారని, వివేకాను అక్కున చేర్చుకున్న హృదయం జగన్‌ది అని తెలిపారు.

Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?

కానీ.. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌లాంటి మహానుభావుడిని వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి లాక్కున్నారని కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే, వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయని నిలదీశారు. ఆరోజుల్లో హరికృష్ణ ఎంత డిమాండ్‌ చేసినా, ఎన్టీఆర్‌ మృతిపై విచారణ జరపలేదని.. అసలెందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ చనిపోతే పోస్ట్‌మార్టం కూడా చేయించలేదన్నారు. ఎన్టీఆర్‌ మరణం వెనుక ఏదో గుట్టు ఉందని, దాన్ని తేల్చాల్సిందేనని చెప్పారు. ఈ విషయంపై తాను ప్రధాని మోడీకి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని కొడాలి నాని పేర్కొన్నారు.

BRS Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో ముదురుతున్న అసమ్మతి పోరు

Show comments