Elections 2029: నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. నా కూతుళ్ళకు రాజకీయాలలో ఆసక్తి లేదు.. రాజకీయాలలో ఆసక్తి ఉంటే నా తమ్ముడి కొడుకు వస్తాడేమో అని తెలిపారు. నాకు ఇప్పుడు 53 ఏళ్లు వచ్చాయి.. ఇప్పుడు గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటా.. ఆ వయసులోమళ్లీ పోటీ చేయలేను అంటూ కొడాలి నాని తెలిపాడు.
Read Also: Mahesh Babu: కళ్లు ఎలా ఉంటాయి.. వేటకు వెళ్ళేటప్పుడు పులి కళ్లులా ఉంటాయి
ఇక, అంతకు ముందుకు.. రాబోయే ఎన్నికల్లో ‘చంద్రబాబు అండ్ కో’ను గోతిలో పాతి పెట్టాలని కొడాలి నాని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ.. పందుల్లా వస్తున్న చంద్రబాబు, ఆయన మిత్రులకు తగిన బుద్ధి చెప్పాలని తెలిపాడు. నారా లోకేశ్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని ఆయన వెల్లడించారు. లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే జూనియర్ ఎన్టీఆర్ పై అనేక కుట్రలు చేస్తూ, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఇక, పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో చేస్తున్నారన్నారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ. 2.50 లక్షల కోట్లను అందించిన జగన్ కోసం ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు. ఎంత మంది ఏకమై వచ్చినా జగన్ ను ఓడించలేరని పేర్కొన్నారు. వైసీపీ రెండోసారి ఘన విజయం సాధించబోతోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.