Site icon NTV Telugu

Atchannaidu: వైసీపీ ఓ గాలి పార్టీ.. గాలికొచ్చి.. గాలికే పోతుంది..!

Atchannaidu

Atchannaidu

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని ప్రకటించిన ఆయన.. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారని.. బాదుడే బడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళ్తుందని పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డ ఆయన.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో గెలిచి చంద్రబాబు సీఎం కాబోతున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన సర్కార్..

ఇక, వైసీపీ ఓ గాలి పార్టీ.. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. వైసీపీకి అసలు రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదన్న ఆయన.. టీడీపీ నుండి వచ్చిన ఇద్దరికి, జగన్ దొంగ లెక్కలు రాసే ఒకరికి, సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని సెటైర్లు చేశారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు.. ఈ బంధాన్ని జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరని స్పష్టం చేశారు. వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా బీసీలను టీడీపీ నుండి వేరుచేయటం జగన్ తరం కాదన్న ఆయన.. పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చారని సెటైర్లు వేశారు అచ్చెన్నాయుడు.

Exit mobile version