NTV Telugu Site icon

Kethireddy Venkatarami Reddy: తిరుపతిలో హనీ రోజ్‌తో మీటింగ్ పెడితే.. పవన్ కళ్యాణ్ మీటింగ్ కన్నా ఎక్కువ జనాలొస్తారు

Kethireddy On Pawan

Kethireddy On Pawan

Kethireddy Venkatarami Reddy Counters On Chandrababu Pawan Kalyan Nara Lokesh: తిరుపతిలో హీరోయిన్ హనీ రోజ్‌తో మీటింగ్ పెడితే.. పవన్ కళ్యాణ్ మీటింగ్ కంటే ఎక్కువగా జనాలు వస్తారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. సినిమా వేరు, రాజకీయాలు వేరని అన్నారు. చిరంజీవి చాలా మంచివారు అయినప్పటికీ.. పాలకొల్లులో ఓడిపోయారని గుర్తు చేశారు. ఏ సినిమా స్టార్ అయినా మొదటిసారి గెలుస్తారని.. ఆ తర్వాత రెండోసారి గెలిచిన దాఖలాలు లేవని చెప్పారు. బాలకృష్ణ తెలివైనవాడని, సొంత ఊర్లో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఓడిపోయేవాడని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి.. గెలుపు కోసం ప్రయత్నం చేయాలే గానీ, పల్లకి మోయడం కాదని పరోక్షంగా పవన్ కళ్యాణ్‌పై కౌంటర్ వేశారు.

Peddireddy Mithun Reddy: దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉంది

చంద్రబాబు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంటే.. దొంగ ఓట్లతోనేనని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. కుప్పంలో పూర్తి స్థాయిలో దొంగ ఓట్లు తొలగిస్తే, చంద్రబాబు గెలుపే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఆధార్ కార్డుతో లింక్ చేస్తున్నారు కాబట్టే.. బోగస్ ఓట్లు బయట పడుతున్నాయని చెప్పారు. 14 వేల దొంగ ఓట్లు ధర్మవరంలో ఉన్నట్లుగా ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో 30 నుంచి 40 వేల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఇవన్నీ చంద్రబాబు పాలనలో నమోదయ్యాయని.. దొంగ ఓట్ల వల్లే ఆయన నెట్టుకుంటూ వస్తున్నాడని పేర్కొన్నారు. ఇక నారా లోకేష్ తన పాదయాత్ర ప్రజల కష్టాలు, సమస్యలపై చేయాలని.. కానీ, ఎక్కడా జనం సమస్యల్ని లోకేష్ వినడం లేదని అన్నారు. లోకేష్ రోజుకు పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. టైంపాస్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పబ్లిక్ పల్స్ పట్టించుకుని పాదయాత్ర చేయాలని హితవు పలికారు.

Revanth meets Bhatti: భట్టి విక్రమార్కతో రేవంత్ భేటీ.. ఖమ్మంలో నిర్వహించబోయే సభపై చర్చ..!

Show comments