NTV Telugu Site icon

Karthika Somavaram Rush: ఏపీలో కార్తీకం సందడి.. కిటకిటలాడుతున్న శైవాలయాలు

karthikam

Pic

కార్తీక సోమవారం కావడంతో శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరో భాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా క్యూలైన్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకం, పాసు పతాభిషేకం ఏక బిల్వార్చనలు, తో పాటు కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల ఎంతో విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకంతో దీపారాధనలు చేసేందుకు మహిళలు గోశాలలో దీపారాధనలు, చేస్తున్నారు చేస్తున్నారు అభిషేక మండపంలో భక్తులు అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు.

Read ALso: Women Crime: ఖతర్నాక్.. బట్టల దుకాణంలో మహిళల హల్ చల్

తొలి కార్తీక సోమవారం కావడంతో అన్నవరం రత్నగిరి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుండే సత్యదేవుని వ్రతాలు సర్వదర్శనాలు ప్రారంభించారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో శైవాలయాల్లో సందడి నెలకొంది. సాలూరు పంచముఖి అలయములో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొలి కార్తీక సోమవారం కావడముతో తెల్లవారి 3గంటలకే దర్శనం కోసం వేచి వున్న భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తొలి కార్తీక సోమవారం కావడంతో పంచారామ క్షేత్రమయిన తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలలయాలలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి గోదావరి స్నానఘట్టాలు. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. దీంతో పుణ్య స్నానాలతో కిక్కిరిసిపోయాయి పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్. స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు మహిళలు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నానఘట్టాలను శుభ్రపరుస్తున్నారు మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శైవ క్షేత్రాలలో భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ, అమరావతిలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజాము నుండి భక్తుల సందడి నెలకొంది. అమరావతి కృష్ణా నది పుష్కర ఘాట్, సూర్య లంక తీరం లలో పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. చలి తీవ్రంగా వున్నా.. చన్నీటి స్నానాలు చేస్తూ భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తున్నారు.

Read Also: Nellore Rotten Meat Seize: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా? బాబోయ్ ఇది తెలుసా?