Srisailam Temple: శ్రీశైలంలో కర్ణాటక సీఎం, మాజీ సీఎం పర్యటన.. పొరపాటు చేశారా..? కన్నడిగుల అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప ఇవాళ శ్రీశైలంలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. నేతల పర్యటనతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీఎం, మాజీ సీఎం.. భ్రమరాంబికాదేవిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారు.. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.. ఎందుకంటే.. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారు కన్నడిగులు.. కానీ, అమ్మవారిని దర్శించుకోకుండానే బసవరాజు బొమ్మై, యడ్యూరప్ప తిరిగి వెళ్లడంపై కన్నడిగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ప్రత్యేక హెలికాప్టర్ సమయం కుదరదని ఫోన్ రావడంతో.. మల్లన్నను దర్శించుకుని వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది..
Read Also: Big Breaking: ‘లైగర్’ తరువాత కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్పకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు… ఏపీ మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, చైర్మన్, ఈవో కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.. అంతకుముందు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రీయ జనజాగృతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చేపట్టిన అభివృద్ధి పనులకు కర్ణాటక ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయాల విరాళం ప్రకటించారు సీఎం బసవరాజ్ బొమ్మై.. కర్ణాటక సీఎంతో పాటు జగద్గురు పీఠం అభివృద్ధి పనులకు 10 లక్షలు విరాళం ప్రకటించారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. ఇక, అమ్మవారిని దర్శించుకోకుండానే శ్రీశైలంలో తమ పర్యటనను ముగించుకుని కాన్వాయ్ లో రోడ్డు మార్గం ద్వారా సున్నిపెంట హెలిప్యాడ్‌కు వెళ్లిని సీఎం, మాజీ సీఎం.. సున్నిపెంట హెలిప్యాడ్ నుండి తిరిగి బెంగళూరుకు బయల్దేరి వెళ్లిపోయారు.. కానీ, వారి పర్యటనలో ఆడపడుచుగా భావించే భ్రమరాంబికాదేవిని దర్శించుకోకపోవడంపై కన్నడిగులు మండిపడుతున్నారు..
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!