NTV Telugu Site icon

Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి

Srisailam 1

Srisailam 1

పరమ పవిత్రమయిన కార్తీక మాసం త్వరలో ముగియనుంది.దీంతో ఇవాళ శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. శ్రీగిరి మల్లన్న ఆలయం ముక్కంటీశుని దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు భక్తులు. శ్రీశైలంలో కార్తీకమాసం నాలుగోవ చివరి సోమవారం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టే అవకాశముంది.

భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాఢవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ముందస్తు ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలంకార దర్శనం ఏర్పాటు వలన త్వరగతిన దర్శనాలు పూర్తవుతున్నాయి. 23 వ తేదీతో కార్తీక మసోత్సవాలు ముగియనున్నాయి.

Read Also:FIFA World Cup 2022: కేరళ, కోల్‌కతాలను ఊపేస్తున్న సాకర్ ఫీవర్‌.. ఎక్కడ చూసినా కటౌట్లే..

అలానే నేటి సాయంత్రం కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం సందర్భంగా ప్రధానాలయ ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కృష్ణమ్మకు నది హారతి వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం వుండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 12 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,294 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 31,554 మంది భక్తులు…ఆదివారం హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు అని టీటీడీ తెలిపింది. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీకాళహస్తి,కపీలతీర్దం ఆలయాలు.. దర్శనాలు, అభిషేకాలు కోసం భారీ క్యూ లైన్ లు వున్నాయి. తిరుపతిలో వేడుకగా జరుగుతున్నాయి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పెద్దశేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో వివరిస్తున్నారు పద్మావతి అమ్మవారు. రాత్రి హంస వాహనం సేవ నిర్వహించనున్నారు.

Read Also: Convicts Escape : అచ్చం సినిమాల్లో లాగే పక్కా ప్లాన్ వేశారు.. ఎస్కేప్ అయ్యారు