Site icon NTV Telugu

SVSN Varma Complaint: పిఠాపురంలో మరో రచ్చ.. కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు..

Svsn Varma

Svsn Varma

SVSN Varma Complaint: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత SVSN వర్మగా అలియాస్‌ శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ తరచూ వార్తల్లో ఉంటారు.. ఇక, ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టర్ ను కలిసి పిఠాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు.. సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోను రెవెన్యూ స్టాంప్‌ సైజులో ఏర్పాటు చేసి అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ… అధికారులకు జ్ఞాపకశక్తి ఉండడం లేదని, సీఎం చంద్రబాబు ఫోటో ఏ సైజులో ఉండాలో వారికి ప్రోటోకాల్ తెలియడం లేదని కలెక్టర్ కి కంప్లయింట్ చేశారు.. ఒక మెమో జారీ చేసి అధికారులకు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు.. సీఎం చంద్రబాబు ఫోటో లేకుండా కార్యక్రమాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని అన్నారు వర్మ.. గత వారంలో పిఠాపురంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసి వేదిక మీద నుంచి కిందకు దిగిపోయారు SVSN వర్మ..

Read Also: CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..

Exit mobile version