NTV Telugu Site icon

Pithapuram: పిఠాపురంలో జనసేన-టీడీపీ మధ్య కుదిరిన ఒప్పందం..

Pithapuram

Pithapuram

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో.. పోటీ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పుకున్నా.. మితపక్షాలైన జనసేన-తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ తప్పదనే వాతావరణం ఏర్పడింది.. ఎవరికి వారుగా అభ్యర్థులను ఎంపికచేసే పనిలో పడపోయారు.. ఆ రెండు పార్టీల నేతలు.. అయితే.. టీడీపీ-జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌పెట్టారు.. రెండు పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు..

Read Also: Israel-Iran War: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య శాంతిలో భారతదేశం పాత్ర పోషిస్తుందా?.. ఇజ్రాయెల్ రాయబారి కీలక ప్రకటన

ఇక, రంగంలోకి దిగిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా.. మంత్రి నిమ్మల.. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఎమ్మెల్యే పంతం నానాజీలతో చర్చించారు.. ఐదు డైరెక్టర్ పదవుల పోటీ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు జరిపారు.. ఐదు డైరెక్టర్‌ పదవుల్లో మూడు జనసేన మద్దతు దారులు, రెండు టీడీపీ మద్దతుదారులకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.. ఇక, చైర్మన్ పదవి జనసేన మద్దతుదారుడు, వైస్ చైర్మన్ పదవి టీడీపీ మద్దతు దారుడుకి ఇవ్వడానికి అంగీకారం తెలిపారు.. ఈనెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.. ఎన్నికలు జరిగినప్పటికీ కూటమి చెప్పిన ఐదుగురు అభ్యర్థులకు ఓట్లు వేయించేలా ఒప్పందం చేసుకున్నారు ఇరు పార్టీల నేతలు..