Kakinada: కాకినాడలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి (జీజీహెచ్) లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో జీఎన్‌ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ధర్మ తేజ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం అతను జీజీహెచ్‌లోనే చికిత్స పొందుతున్నాడు. అయితే, తాను మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని, చదువుల్లో ముందుకు సాగలేకపోతానని ప్రిన్సిపాల్ విమలకు ధర్మ తేజ చెప్పినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎగ్జామ్స్‌లో చూద్దామంటూ ప్రిన్సిపాల్ బెదిరించారని ఆరోపిస్తున్నారు.
Read Also: PM Modi: పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్
ఇక, ధర్మ తేజకు ముందు నుంచే మానసిక సమస్యలు ఉన్నాయని, వాటి ప్రభావంతోనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని జీజీహెచ్ ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే, తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అయితే, ధర్మ తేజకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉండటంతో అతనితో గతంలో అనేక కాలేజ్ పనులు చేయించుకున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అతనిపై విద్య భారం కాకుండా అదనపు ఒత్తిడి పెరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ధర్మ తేజ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.
