Samarlakota Municipality: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ పై నేడు అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుంది.. చైర్‌పర్సన్ అరుణ పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది కౌన్సిలర్లు.. ఆర్జీవో మల్లిబాబు ప్రత్యేక అధికారిగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది.. వైసీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఉంటూ, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారని అరుణను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ.. అయితే, మున్సిపాలిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉండగా ఇద్దరు చనిపోయారు, ఒకరు రాజీనామా చేశారు.. ఎమ్మెల్యే చినరాజప్పకు ఓటు ఉంటుంది… దాంతో మొత్తం 29 ఓట్లు ఉన్నాయి.. అందులో వైసీపీకి 25 మంది కౌన్సిలర్ల బలం ఉండగా.. ఎమ్మెల్యేతో కలిపి టీడీపీకి కేవలం నలుగురు సభ్యులు బలం మాత్రమే ఉంది.. దాంతో అవిశ్వాస తీర్మానంలో గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.. 19 మంది బలం ఉంటే అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభిస్తుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి.. చాలా వరకు కూటమి సర్కార్ కైవసం చేసుకున్న విషయం విదితమే..
Read Also: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌పై వెలుగులోకి సంచలన విషయాలు! ఏం జరిగిందంటే..!
