Site icon NTV Telugu

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్..! కూతురు క్రాంతి తీవ్ర ఆవేదన

Kranti,

Kranti,

Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారట.. ఈ విషయం తెలిసి.. తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు.. ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించాడట.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి..

Read Also: Covid 19 Update: 498 కొత్త కరోనా కేసులు.. నలుగురు మృతి!

“నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.. కానీ, నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా నాన్నకు అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. ఇటీవల, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఒకరు నన్ను నా తండ్రి (ముద్రగడ పద్మనాభం)ని చూడటానికి మంచి ఉద్దేశంతో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, నా సోదరుడు గిరి మరియు అతని మామ.. నా తండ్రిని కలవడానికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నా తండ్రి ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి సమాచారాన్ని తెలియనీయడంలేదు.. దగ్గరి బంధువులకు.. అనుచరులకు కూడా ఈ విషయంపై తాజా పరిస్థితి తెలియని పరిస్థితి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. గిరి, అతని అత్తమామల సన్నిహితులచే మా నాన్న (ముద్రగడ పద్మనాభం) నిర్బంధించబడ్డారు.. ఒంటరిగా ఉంచారు.. నాన్నను సంప్రదించడానికి లేదా మాట్లాడటానికి ఎవరికీ అనుమతి ఇవ్వడంలేదని తెలిసిందన్నారు.. గిరి, ఇది కేవలం అమానుషం కాదు – ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తే మాత్రం.. నేను ఖచ్చితంగా స్పష్టంగా చెబుతున్నా.. నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని వార్నింగ్‌ ఇచ్చారు.. మా నాన్న గౌరవం తగ్గకుండగా.. ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకమైన సమాచారం ఇవ్వాలని.. సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ట్వీట్‌ చేశారు క్రాంతి..

Read Also: Gold Price Today: మూడు వేలు పెరిగిన వెండి.. నేడు తులం బంగారం ఎంతుందంటే?

కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కూతురు క్రాంతి మధ్య రాజకీయ విభేదాలు వచ్చిన విషయం విదితమే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ముద్రగడ పద్మనాభం ప్రచారం చేయగా.. క్రాంతి మాత్రం.. జనసేనాని కలిసి మద్దతు ప్రకటించి.. జనసేనకు ప్రచారం నిర్వహించారు.. అప్పట్లో ఈ వ్యవహారం ముద్రగడ ఫ్యామిలీలో తీవ్ర వివాదం సృష్టించగా.. ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది..

Exit mobile version