Minister Narayana: కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగూరు నారాయణ టెలీ కాన్ఫరెన్స్ వైరల్ గా మారింది.. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పిఠాపురం వ్యవహారాన్ని ప్రస్తావనకు తీసుకుని వచ్చారు.. లైన్ దాటిటే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని వర్మ గురించి ఆడియోలో చెప్పారు. పిఠాపురంలో వర్మ ని జీరో చేశామని, పవన్ కల్యాణ్‌కి, వర్మకి రోజు ఘర్షణ జరుగుతుందని.. అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.. 4 నెలలు నుంచి వర్మ ఇచ్చే స్టేట్‌మెంట్లతో అతనిని జీరోని చేసామని, తనను జీరోని చేశారని వర్మనే చెప్తున్నాడని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు.. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలో స్టేట్‌మెంట్ ఇవ్వడానికి లేదని.. పిఠాపురంలో వర్మ మాట్లాడడానికి లేదని సీఎం చంద్రబాబు నాయుడు తన ముందే అతనికి చెప్పారని తెలిపారు మంత్రి నారాయణ.. అంతేకాదు, జనసేన వాళ్లు పిలిస్తే వర్మ వెళ్లి మాట్లాడాలి.. లేకపోతే లేదంటూ మంత్రి పొంగూరు నారాయణ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి..
Read Also: Off The Record: వైసీపీ జోరుతో ఆ సీనియర్ నేత అజ్ఞాతం వీడి బయటికొస్తున్నారా..?
