Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రావివారిపోడులో పవన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది.. కాకినాడ సెజ్ అవార్డు భూములు 2,180 ఎకరాల తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్లు చేసేలా నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. సెజ్ పరిధిలోని 1,551 మంది రైతులకు చెందిన 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు.. రావిపాడులో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు..
Read Also: Shocking : కూలీకి వెళ్లే మహిళలే టార్గెట్.. పని పేరుతో నమ్మించి కిరాతకంగా..
కాగా, కాకినాడ సెజ్‌లో భూములు కోల్పోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.. కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. అంతేకాదు, రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది.. దీంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీకి కార్యరూపం దాల్చినట్టు అయ్యింది.. కాకినాడ సెజ్ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట.. కాకినాడ సెజ్‌కు రైతులు ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు. రైతుల వద్ద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.. అయితే, ఎన్నికల వేళ రైతులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. హామీ నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
