TDP Vs YCP Leaders Fight: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందగా, మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు శ్రీరామ్ మూర్తి, దుర్గా ప్రసాద్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న టీడీపీ కార్యకర్తల మార్గంలో వైసీపీ నేతలు ఎదురు పడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. పాత గొడవల నేపథ్యమే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: ADAS, పానోరమిక్ సన్రూఫ్, 7 సీట్లు.. ప్రీమియం లుక్లో MG Majestor
అయితే, ఈ వివాదంలో వైసీపీ కార్యకర్తలు సతీష్, నారాయణ మూర్తి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘర్షణకు వైసీపీ నాయకుడు చింతకాయల చినబాబు కారణమని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.