NTV Telugu Site icon

Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్కు ఎమ్మెల్యే నానాజీ క్షమాపణలు

Nanaji

Nanaji

Pantham Nanaji: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు చెప్పారు. కేసు నమోదు చేయొద్దని కూడా నేను అడగడం లేదన్నారు. నేను వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపంలో బూతులు వచ్చేశాయని పేర్కొన్నారు. తీరా చూస్తే ఈయన నా స్నేహితుడే.. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నాను అని ఎమ్మెల్యే ప్రకటించారు.

Read Also: Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..

కాగా, దాడికి గురైన డాక్టర్‌ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. కేసు పెడుతున్నామని చెప్పారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని స్టూడెంట్స్ కు సూచించారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. ముందుగా నేరస్థులను గుర్తించాలి అని అన్నారు. నాతో పాటు దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు. ఎమ్మెల్యే మీద నాకు కోపం లేదు.. కానీ పది మంది మధ్య చేసిన పని బాలేదని వైస్ చైర్మన్ విచారం వ్యక్తం చేశారు.

Read Also: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..

అయితే, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డాక్టర్లు ఆందోళనకి సిద్ధమవుతున్నారు. జీజీహెచ్ దగ్గర నిరసన తెలుపనున్నారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీని కలిసి ఈ సంఘటనపై వైద్యులు ఫిర్యాదు చేయనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడే విషయంలో డాక్టర్ ను బూతులు తిట్టి, మాస్క్ లాగేసిన ఎమ్మెల్యే నానాజీ.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ జోక్యంతో డాక్టర్ కి పంతం నానాజీ క్షమాపణలు చెప్పారు.