NTV Telugu Site icon

Pithapuram: పిఠాపురంలో ఆసక్తికరణ పరిణామాలు.. మళ్లీ జనసేన వర్సెస్‌ టీడీపీ..!

Pithapuram

Pithapuram

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారు.. అయితే, ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం.. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్‌ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు.. ఇదే ఇప్పుడు చర్చగా మారింది..

Read Also: Israel Army Chief: హమాస్‌ దాడిని నిలువరించడంలో తాము ఫెయిల్ అయ్యాం..

టీడీపీ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.. ఇక, ఆ తర్వాత జనసేనకు మద్దతు ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థి… కానీ, జనసేన పొత్తు ధర్మం పాటించలేదని.. అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడని టీడీపీ ఆరోపణలు చేస్తుంది.. మరోవైపు.. పోటీ చేసిన రెండో వార్డులో టీడీపీ రెబల్ ను ఎందుకు ఎంకరేజ్ చేశారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఇండిపెండెంట్ గా గెలిచిన రాంబాబు.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు అనుచరుడుగా చెబుతున్నారు.. అయితే, ఈ పరిణామాలు మరోసారి పిఠాపురంలో జనసేన వర్సెస్‌ టీడీపీగా మారాయనే చర్చ సాగుతోంది.. ఎందుకంటే..? ఈ ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నా.. కూటిమిలోని టీడీపీ-జనసేన పార్టీలే పోటాపోటీగా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యంతో.. మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడి నేతలతో మాట్లాడి ఒప్పందం చేసి సయోధ్య కుదిర్చిన విషయం విదితమే.

Show comments