Site icon NTV Telugu

Pastor Praveen Pagadala Case: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఐజీ..

Ig Ashok Kumar

Ig Ashok Kumar

Pastor Praveen Pagadala Case: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ఆయన మృతిచెందిన ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు భావించినా.. ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రవీణ్‌ పగడాల హైదరాబాద్‌ నుంచి బయల్దేరి.. ప్రమాదానికి గురైనంత వరకు అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు.. మార్గమధ్యలో సీసీ ఫుటేజ్‌.. యూపీఐ పేమెంట్స్‌, ఆయన రోడ్డుపై పడిపోవడం.. షాపులో కనిపించడం.. ఇలా అన్ని రకాల సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు.. ఇక, ఈ కేసులో కీలక విషయాలను వెల్లడించారు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్..

Read Also: Gold Price Today: బంగారం ప్రియలకు భారీ షాక్.. వరుసగా నాలుగో రోజూ బాదుడే!

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్.. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు.. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు వచ్చేలోపు ప్రవీణ్ ఆరుగురితో మాట్లాడినట్టు గుర్తించాం.. మీడియాలో అనుమానాలు వ్యక్తం చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించాం.. కానీ, ఎవరు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు.. గత నెల 24వ తేదీన జరిగిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పదపై ఎవరు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదన్న ఐజీ… పాస్టర్ ప్రవీణ్ మార్గమధ్యలో రెండు చోట్ల వైన్ షాప్‌లకి వెళ్లారని తెలిపారు.. యూపీఐ పేమెంట్ చేసినట్లుగా కూడా గుర్తించాం.. కోదాడ వద్ద బండితో పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు తెలిసి వివరాలు సేకరించాం.. విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ తో పాటు మరో వ్యక్తి విట్ నెస్ తీసుకున్నాం అని పేర్కొన్నారు..

Read Also: Sangareddy: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు మృతి

మొత్తంగా పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు ఐజీ అశోక్‌ కుమార్‌.. మద్యం తాగడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగింది.. దర్యాప్తులో అదే తేలిందన్నారు.. మార్గం మధ్యలో మూడు సార్లు ప్రమాదానికి గురయ్యాడు.. ఫోరెన్సిక్‌ రిపోర్టులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.. ప్రవీణ్‌ పగడాల బుల్లెట్‌పై స్పీడ్‌గా రావడంతో అదుపుతప్పి రాళ్లపై స్కిడ్‌ అయ్యి పడిపోయారని వివరించారు.. 2 వారాల సుదీర్ఘ విచారణలో 113 మంది సాక్షులను విచారించాం.. పాస్టర్‌ ప్రవీణ్‌ గతంలో మద్యం సేవించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.. ఇక, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌..

ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..
* 24వ తేదీన ఉదయం 11.51 గంటలకు హైదరాబాదులోని ఇంటి నుండి బయల్దేరిన ప్రవీణ్ పగడాల..
* హైదరాబాద్‌ గణేష్ నగర్ లోని ఒక సవేరా లిక్కర్ మాల్‌లో లిక్కర్ కొనుగోలు..
* కోదాడ వద్ద ఆదిత్య వైన్ షాప్ లో మద్యం బాటిల్ తీసుకున్న పాస్టర్..
* జగ్గయ్యపేట టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుండి పడిపోయిన ప్రవీణ్‌.. తప్పిన పెద్ద ప్రమాదం.
* ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో తప్పిన ప్రమాదం..
* ప్రవీణ్‌కు సహాయం చేసిన టోల్ ప్లాజా సిబ్బంది.. రోడ్డుపై వెళ్తున్నా వాహనదారులు
* చిలకల్లు టోల్ ప్లాజా వద్ద రెండో సారి బైక్ పై నుండి పడిపోయిన ప్రవీణ్‌.
* అంబులెన్స్ వచ్చి ప్రథమ చికిత్స చేయడానికి ప్రయత్నించినప్పటికీ తను బాగానే ఉన్నానని వైద్యానికి నిరాకరణ..
* చిల్లకల్లు టోల్‌ ప్లాజా వద్దే బైక్ హెడ్ లైట్ డ్యామేజ్‌.. ప్రవీణ్‌కు స్వల్ప గాయాలు
* మొదటి నుండి ప్రమాదకర పరిస్థితుల్లోనే బైక్ నడిపినట్టు గుర్తించాం..
* గొల్లప్రోలు బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకున్నారు.
* విజయవాడ రామవరప్పాడు వద్ద మళ్లీ పడిపోయిన పాస్టర్..
* ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి ట్రాఫిక్ ఎస్ఐ.. ఈ పరిస్థితుల్లో ప్రయాణం చేయొద్దని సూచన..
* విజయవాడలో పార్కులో రెండు గంటలసేపు విశ్రాంతి తీసుకున్న ప్రవీణ్‌ పగడాల.
* ట్రాఫిక్ పోలీసులకు కనిపించకుండా మళ్లీ తను ప్రయాణం స్టార్ట్‌ చేసిన పాస్టర్..
* హెడ్ లైట్ పోవడంతో రైట్ సైడ్ ఇండికేటర్ తోనే ప్రయాణం
* ఏలూరులోని నిపున్స్ టానిక్ వైన్ షాప్ లో మళ్లీ మద్యం కొనుగోలు..
* బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిన ప్రవీణ్ పగడాల
* మార్చి 24న రాత్రి 11.42 గంటలకు కొంతమూరు వద్ద బైక్‌ రోడ్డు కిందకు దూసుకెళ్లి ప్రవీణ్‌ పగడాల మృతి

Exit mobile version