Site icon NTV Telugu

SVSN Varma: నేను పిఠాపురంలోనే పుట్టా.. పిఠాపురంలోనే పెరిగా.. ఎవడైనా సొంత ఊరు వదిలి వెళ్లిపోతారా..? వర్మ హాట్‌ కామెంట్స్..

Svsn Varma

Svsn Varma

SVSN Varma: గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ) వార్తల్లో నిలిచారు.. మొదట సీటు కోసం పట్టుబట్టిన ఆయన.. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్దిచెప్పడంతో.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు.. ఇక, పవన్‌ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.. అయితే, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.. ఇప్పుడు మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు శర్మ.. నియోజకవర్గ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటుగా స్పందించారు. తాను పిఠాపురాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Read Also: Toxic Movie Teaser: ‘టాక్సిక్‌’ టీజర్‌కు సర్టిఫికేట్ అవసరం లేదన్న సెన్సార్ బోర్డు!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వర్మ మాట్లాడుతూ.. “నేను పిఠాపురంలోనే పుట్టాను.. పిఠాపురంలోనే పెరిగాను. సొంత ఊరు వదిలి ఎవడైనా వెళ్లిపోతారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం తనకు కేవలం రాజకీయ నియోజకవర్గం మాత్రమే కాదని, తన జీవితం, తన ఊరని పేర్కొన్నారు.. అయితే, పార్టీ అవసరాల మేరకు వేరే బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లి పని పూర్తి చేసి తిరిగి తన సొంత ఊరైన పిఠాపురానికి వస్తానని స్పష్టం చేశారు. పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తించడం తన కర్తవ్యమని స్పష్టం చేసిన ఆయన.. కానీ, పిఠాపురాన్ని మాత్రం ఎప్పటికీ వదలబోనని తెగేసి చెప్పారు.. అయితే, వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

ఇక, వైఎస్‌ జగన్ రెడ్డి అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన వర్మ.. ఇద్దరు ఉండే జగన్ కుటుంబానికి వేల ఎకరాలు..? ఐదు కోట్ల ప్రజలకు రాజధాని వద్దా ? అని నిలదీశారు.. జగన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు ఉండడానికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో లక్ష చదరపు అడుగులు, బెంగళూరులో ప్యాలస్ 30 ఎకరాలు, తాడేపల్లి ప్యాలస్ 87,120 చదరపు అడుగులు, కడపలో రాజ్ భవన్ 10 ఎకరాలు, ఇడుపుల పాయలో 350 ఎకరాలు, చెన్నైలో ప్యాలస్ 8 ఎకరాలు, ముంబాయి ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు, ఇద్దరు సభ్యులు ఉండే జగన్మోహన్ రెడ్డికి ఐదు వందల ఎకరాల పైగా విలాసవంతమైన భవనాలు ప్యాలస్ లు ఉండాలి.. కానీ, కోట్లాది మంది ప్రజలకు అవసరమయ్యే రాజధాని మాత్రం విశాలంగా ఉండకూడదా జగన్ ? అంటూ నిలదీశారు వర్మ..

 

Exit mobile version