Site icon NTV Telugu

Kakinada Crime: తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కోపం.. పార్టీ అని పిలిచి చంపి పాతిపెట్టిన అన్న..

Crime

Crime

Kakinada Crime: తన చెల్లిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిపై కోసం పెంచుకున్న యువకుడు.. పార్టీ అంటూ పిలిచి.. దారుణంగా హత్య చేసి.. పాతిపెట్టిన కాకినాడ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పి వేమవరంలో తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కిరణ్ కార్తీక్ అనే యువకుడుని కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి చంపి పూడ్చి పెట్టాడు.. కృష్ణ ప్రసాద్ చెల్లితో కిరణ్ కార్తీక్ సన్నిహితంగా ఉంటున్నాడు… దాంతో కిరణ్ కార్తీక్ ను పార్టీకి అని పిలిచి మద్యం పట్టించి చంపి లే అవుట్ లో పాతిపెట్టాడు.. కృష్ణ ప్రసాద్, స్నేహితులు సాయం తీసుకుని కిరణ్ కార్తీక్ ను అతి కిరాతకంగా చంపేశాడు ఈ ఘటన గత నెల 24న జరిగింది.. అప్పటినుంచి తన కుమారుడు కిరణ్ కార్తీక్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తల్లిదండ్రులు.. అయితే, విచారణ జరుగుతుండగా భయంతో పోలీసులకు లొంగిపోయారు నిందితులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

Read Also: Rahul Gandhi: “శానిటరీ ప్యాడ్‌ ప్యాకెట్ల”పై రాహుల్ గాంధీ బొమ్మ.. కాంగ్రెస్‌పై విమర్శలు..

Exit mobile version