NTV Telugu Site icon

AP Deputy CM: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉండాలి..

Pawan

Pawan

AP Deputy CM: గత ప్రభుత్వము అడ్డగోలుగా నిధులు తీసుకుని పంచాయతీలకి ఇవ్వలేదు.. నిధుల కొరత ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సిబ్బంది కొరత ఉంది.. కోరింగ ఫారెస్ట్ లో అరుదైన ఫిషింగ్ క్యాట్ గణన చేయాలి.. దేశంలో అన్ని రాష్ట్రాలకి ఏపీ తలమానికంగా ఉండాలి.. మడ అడవులను రక్షించుకోవాలి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు ఉండాలి.. పంచాయతీలకు ఇన్ని సంవత్సరాలు నిధులు రాలేదు అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ ఐదేళ్ల లో ఏడాదికి రూ. 1000 కోట్లు పంచాయతీలకు రావాల్సి ఉంటుంది.. పిఠాపురంలో 40 పంచాయతీలలో నిధులు లేవు.. హాప్ ఐ ల్యాండ్ లో మడ అడవులను కాపాడుకుంటూ.. ఏకో టూరిజంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని పవన్ తెలిపారు.

Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

ఇక, ఉప్పాడ కాకినాడ రోడ్డు లో ప్రతి ఏడాది సముద్రం ముందుకు వస్తుంది అని పవన్ కళ్యా్ణ్ తెలిపారు. భీమవరంకి చెందిన తేజశ్విని అనే అమ్మాయిని 9 నెలలు ముందు లవ్ ట్రాప్ లో పడేసి కిడ్నాప్ చేసారని వాళ్ళ అమ్మ చెప్పింది.. పోలీసులు 48 గంటలలో వాళ్ళను అద్భుతముగా పట్టుకున్నారు.. జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయిని గుర్తించారు.. ఇటువంటి బాధలు ఐదేళ్లు పడ్డారు.. గతంలో ఇదే పోలీసు.. ఇదే ప్రభుత్వం.. గత ప్రభుత్వం లో 30 వేలు అమ్మాయిలు మిస్ అయ్యారు.. ఇంత మంది అమ్మాయిలు మిస్ అయితే మనం ఎందుకు ప్రత్యేక సెల్ పెట్టకూడదని క్యాబినెట్ లో ప్రస్తావిస్తామన్నారు. పోలీసులకి నిధులు కొరత ఉంది.. పోలీస్ వ్యవస్థకి ధన్వవాదాలు తెలిపారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read Also: CPI Narayana: రాజకీయాలలో స్పష్టమైన వైఖరి ఉండాలి.. దొంగాటలు ఆడకూడదు

అయితే, ఒక అమ్మాయి మిస్ అయ్యి 24 గంటలు అయితే మరచిపో అంటారు.. నేను ప్రగల్బాలు పలకను.. ఫలితాలు చూపిస్తాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపము కాదు.. గత ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కేశారు.. ఏ నిధులు దేనికి కేటాయించాలో వాటికి గత ప్రభుత్వం కేటాయించలేదు.. ఈ ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం.. అగ్రికల్చర్ టూరిజం మరింత ముందుకు వెళ్ళాలి.. పోలీసులు, హోం గార్డులు సమస్య నా దృష్టిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.